వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: గవర్నర్‌తో జానా భేటీ, ఆ తర్వాత ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి వేచి చూస్తామని, తమకు అధిష్టానంపై నమ్మకం ఉందని మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పడానికి ముందు జానా రెడ్డి సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. నరసింహన్‌తో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రుల సమావేశం జరిగింది. మంత్రుల సమావేశంలో చర్చించిన తర్వాత జానా రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై జానా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీడియా సమావేశంలో జానా రెడ్డి తర్వాత శ్రీధర్ బాబు మాట్లాడారు. మిగతా మంత్రులు ఏమీ మాట్లాడలేదు. ఇటు జానారెడ్డి మీడియా సమావేశం పెట్టి అవసరమైనప్పుడు రాజీనామాలు చేస్తామని ప్రకటించడానికి కొద్ది సేపటికి ముందే తాము రాజీనామాలు చేస్తున్నామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు.

ఫొటోలు: గవర్నర్‌తో జానా భేటీ, ఆ తర్వాత ఇలా...

ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన తర్వాత జానా రెడ్డి నేతృత్వంలో మీడియా సమావేశానికి వచ్చి కూర్చున్న తెలంగామ మంత్రులు

ఫొటోలు: గవర్నర్‌తో జానా భేటీ, ఆ తర్వాత ఇలా...

కెసిఆర్‌ తీరుపై మండిపడుతూ, తెలంగాణపై తన వాదనను మీడియా సమావేశంలో వినిపిస్తూ జానారెడ్డి..

ఫొటోలు: గవర్నర్‌తో జానా భేటీ, ఆ తర్వాత ఇలా...

జానారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా మంత్రులు ఇలా..

ఫొటోలు: గవర్నర్‌తో జానా భేటీ, ఆ తర్వాత ఇలా...

జానారెడ్డి తనదైన రీతిలో మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడుతూ ఇలా...

జానా రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో అటు మాట్లాడడం పూర్తి చేసిన కొద్ది సేపటికే తెలంగాణ సమరదీక్షలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రసంగించారు. రాజీనామాలపై జానా రెడ్డి చేసిన ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు. రాజీనామాలు చేయరట అంటూ కెసిఆర్ జానారెడ్డిపై, తెలంగాణ మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధమని జానా రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ తనపై వాడిన భాష పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద రావు కూడా సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

English summary
Senior minister K Jana Reddy has met governor Narasimhan. After that Telangana ministers have met to discuss about the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X