వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే రాజీనామాస్త్రం: అధిష్టానంపై ఒత్తిడికి కాంగ్ ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు రాజీనామాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణపై ఆఖరు నిమిషంలో కాంగ్రెసు పార్టీ, కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వెనక్కి వెళ్లిందని వారు భావిస్తున్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేస్తామని హెచ్చరించడంతోనే అధిష్టానం వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు.

దీంతో వారు కూడా అదే అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే సాయంత్రం మంత్రి జానా రెడ్డి ఇంట్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.

కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన గడువు ఈ రోజు(సోమవారం)తో ముగియనుంది. ఈ రోజు కేంద్రం నుండి తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాకుంటే రేపు అందరి కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రులు తమ మంత్రి పదవులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. రాజీనామాలు చేసి ఒత్తిడి తెస్తేనే కేంద్రం తెలంగాణ ఇస్తుందనే నిర్ణయానికి వారు వచ్చినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ సున్నితమైన అంశం

తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మరింత లోతైన అధ్యయనం కావాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ సోమవారం గుంటూరు జిల్లాలో అన్నారు.

English summary
It is said that Telangana ministers are planning to resign for their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X