అసద్‌తో మాట్లాడేందుకు అక్బర్‌కు గంట, కేసు 8వతేదికి

అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో గత ఏడాది చివరి సంవత్సరంలో హిందువుల పైన, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అతను జైలులో ఉన్నారు. 2005 నాటి కేసులో అక్బర్ కూడా ఉన్నాడు. దీంతో అతనిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్బంగా అసద్, ఇతర పార్టీ నేతలతో మాట్లాడుకునేందుకు కోర్టు అక్బరుకు గంటసేపు అనుమతి ఇచ్చింది. అనంతరం కేసును ఫిబ్రవరి 8వ తేదికి వాయిదా వేసింది.
కాగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి నాలుగు రోజుల క్రితం బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సంగారెడ్డి కోర్టు అసద్‌కు గురువారం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంతకుముందు వరుసగా రెండు రోజులు ఆయన బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. గురువారం ఆయనకు బెయిల్ వచ్చింది. రూ.10వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అసద్ ఆ రోజు సాయంత్రం జైలు నుండి విడుదలయ్యారు.
విడుదలైన అసద్ తమపై వ్యక్తిగత కక్షతోనే కాంగ్రెసు ప్రభుత్వంపై తమను అరెస్టు చేసిందని అప్పుడు అన్నారు. ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకముందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా, వ్యక్తిగతంగా కాంగ్రెసును ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం బాగాలేదని, ఏమైనా జరిగితే కాంగ్రెసు పార్టీదే బాధ్యత అన్నారు. కాంగ్రెసు - బిజెపిల సంబంధాన్ని తాము ప్రజలకు వివరిస్తామన్నారు.


Click it and Unblock the Notifications