రాయలసీమను అంటే నాలుక చీరేస్తాం: బైరెడ్డి హెచ్చరిక

రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే మూడు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాయలసీమ వారిని నమ్మించి మోసం చేసి శ్రీభాగ్ ఒడంబడికపై సంతకాలు చేయించారన్నారు. ఆ ఒప్పందం అమలు కాకపోవడంతో రాయలసీమలో సాగునీరు, తాగునీరు కూడా లేనిపరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే ఈ ప్రాంత పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణ అంశంపై తేల్చకుండా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆరోపించారు. ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆటలాడుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణపై సంప్రదింపుల పేరుతో ఇంకా కాలయాపన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టమని ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే ముత్యం రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐతే జాప్యం మూలంగానే ఇంతదాక వచ్చిందని, గోటితో తీరేదానిని గొడ్డలిదాకా తేవొద్దని అధిష్ఠానాన్ని హెచ్చరించారు. తెలంగాణ కోసం తాము వయలర్ రవి, ఆజాద్, షిండేలను కలిసి సాధ్యమైనంత వరకు తమ అభిప్రాయలను వినిపించామన్నారు.












Click it and Unblock the Notifications