ఆ చట్టాలే ఉంటే బొత్సకు జీవిత ఖైదు పడేది: జూపల్లి

తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారా అని అడగడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీకి సిగ్గుండాలని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రానప్పుడు తనంత మొగోడు లేడన్న జానారెడ్డి మంత్రి పదవి రాగానే ఎందుకు మౌనంగా మారిపోయారని అడిగారు. పదవుల కోసం గడ్డి తినే మంత్రులు కెసిఆర్‌ను విమర్శిస్తారా అని ఆయన అడిగారు. తెలంగాణ మంత్రులు లఫంగి కూతలు కూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రుల తీరుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీపై, ప్రధాని మన్మోహన్ సింగ్‌పై హత్యా కేసులు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. బేరసారాలు చేసుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టింది కిరణ్ కుమార్ రెడ్డా, కెసిఆరా అని ఆయన అడిగారు. పదవులకు రాజీనామా చేయకుండా తెలంగాణ మంత్రులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని వ్యాఖయానించారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి తెలంగాణ మంత్రులు గులాంగిరీ చేస్తున్నారని జూపల్లి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనివారిని ద్రోహులని కాకుండా ఏమంటారని ఆయన అడిగారు. కెసిఆర్‌ను విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని, ముందు జగ్గారెడ్డి వేషం, భాష మార్చుకోవాలని ఆయన అన్నారు.
కెసిఆర్ మాట్లాడింది తెలంగాణ భాష అని తెలంగాణ ఉద్యోగుల సంగం అధ్యక్షుడు విఠల్ అన్నారు. సీమాంధ్ర నేతలు పయ్యావుల కేశవ్, ఉండవల్లి అరుణ్ కుమార్ కారుకూతలు కూస్తే ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన అడిగారు. తమ ఆవేదనను వ్యక్తం చేస్తే కేసులు బనాయిస్తామని అనడం దారుణమని ఆయన అన్నారు. కెసిఆర్ మాట్లాడిన భాషను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధాని లాగా నాలుగో తరగతి ఉద్యోగి కూడా కూడా ప్రజాసేవకుడేనని, ఒక ప్రజా సేవకుడని మరో ప్రజా సేవకుడితో పోలిస్తే తప్పేమిటని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయబోమని, కేసులకు భయపడేది లేదని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!