రమ్మంటే.: కెజెపి స్థాపకుడికి యడ్డీ షాక్, రిజైన్ల పరంపర

ఆయన తీరుతో షాక్‌కు గురైన యడ్డీ అతనికే తిరిగి ఝలక్ ఇచ్చారు. తనను అధ్యక్ష పదవి నుండి తొలగించే అర్హత ప్రసన్నకు లేదని, పార్టీపై పూర్తి హక్కులు తనకు ఉన్నాయని చెబుతూ అతనిని పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రసన్న ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. చట్టరీత్యా తనకు పార్టీపై అధికారం ఉందన్నారు. దీనిపై పోరాటానికి ప్రసన్న కుమార్ సిద్ధమయ్యారు.
ఇబ్బందుల్లో శెట్టార్ ప్రభుత్వం
జగదీష్ శెట్టార్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. యడ్యూరప్పకు వర్గానికి చెందిన 13 మంది బిజెపి ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు మంగళవారం రాజీనామాలు చేశారు. స్పీకర్ చాంబర్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కెజి బోపయ్య మంగళవారం రాత్రి ప్రకటించారు. అంతకుముందు ఒక్క చెళ్లకెరె ఎమ్మెల్యే తిప్పేస్వామి రాజీనామాను మాత్రమే స్పీకర్ ఆమోదించడం రాజకీయ వేడి పుట్టించింది.
మిగిలిన 12 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ బిజెపి శాసనసభ్యుల ప్రతినిధివర్గం ఇచ్చిన ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ అభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే, వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటానని బోపయ్య ప్రకటించారు. అంతవరకు రాజీనామాలను ఆమోదించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. స్పీకర్ ఒక్కరి రాజీనామానే ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆయన చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు.
రాత్రంతా అక్కడే ఉండేందుకు వీలుగా దుప్పట్లు కూడా తెచ్చుకున్నారు. మిగతా 12 మంది రాజీనామాలను సమర్పించినట్టు శాసనసభా వర్గాల నుంచి సమాచారం అందడటంతో వారంతా శాంతించారు. దీంతో శెట్టర్ సర్కారు మైనారిటీలో పడిపోయింది. 224 సభ్యుల శాసనసభలో 13 మంది రాజీనామాలతో (యడ్యూరప్ప, శ్రీనివాస పూజారి ఇప్పటికే రాజీనామాలు చేశారు) సభ్యుల సంఖ్య 209కి చేరుకుంది.
అందులో బిజెపికి 105, కాంగ్రెస్ 71, జెడిఎస్‌కి 26, స్వతంత్రులు ఆరుగురు, బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. మరో ఏడుగురు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. అదే జరిగితే శెట్టార్ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకున్నట్లే. కాంగ్రెసు, జెడిఎస్‌లకు కలిపి 97 మంది శాసనసభ్యులు ఉన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications