చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమల్‌కు కష్టాలు: జయతో సంబంధం తెగడం వల్లేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kamal Hassan-Jayalalitha
చెన్నై: కమల్ హాసన్‌కు సినిమా కష్టాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితతో సంబంధాలు తెగినందు వల్లే అనే ప్రచారం జరుగుతోంది. కమల్ ప్రతిష్టాత్మకంగా తీసిన విశ్వరూపం చిత్రం విడుదల కోసం తమిళనాడులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న విడుదల కావాల్సిన కమల్ విశ్వరూపంలో ముస్లింల మనోభావాలు కించపర్చేలా సీన్స్ ఉన్నాయంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. వారం రోజులుగా ఈ రగడ సాగుతోంది.

దీనికంతా జయలలితతో కమల్‌కు ఉన్న మంచి సంబంధాలు తెగడమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కమల్‌తో చర్చలు జరిపిన ముస్లిం పెద్దలు అందులో భారతీయ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఎలాంటి సన్నివేశాలు లేవని స్పష్టం చేశారట. అయినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం తగ్గలేదు. విశ్వరూపాన్ని అడ్డుకునేందుకే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. స్వయంగా కేంద్రం కూడా విశ్వరూపం సినిమాపై బ్యాన్ ఎత్తివేయాలని తమిళ ప్రభుత్వాన్ని కోరింది.

అయినా తమిళనాడు ప్రభుత్వం తగ్గలేదు. అంతేకాకుండా విశ్వరూపంలో ముస్లింల మనోభావలు దెబ్బతీసేలా ఎలాంటి సన్నివేశాలు లేవని తమిళనాడు న్యాయమూర్తి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల విడుదలయింది. కానీ తమిళనాడులో మాత్రం ఆ సినిమాకు కష్టాలు తప్పడం లేదు. బుధవారం ఉదయం సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఆ వెంటనే ప్రభుత్వం మళ్లీ హైకోర్టును స్టే ఇవ్వాలని ఆశ్రయించింది. దీంతో హైకోర్టు విశ్వరూపంపై స్టే ఇచ్చింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు కమల్ సిద్ధమయ్యారు. కళాకారులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం విశ్వరూపం చిత్రం వివాదంపై మాట్లాడుతూ అన్నారు. ఈ చిత్రంపై జరిగిన అన్ని పరిణామాలను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. చిత్రం విడుదలపై పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

విశ్వరూపంకు ఎదురవుతున్న ఇబ్బందులతో కమల్ హాసన్ ఈ రోజు ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. ఎంఎఫ్ హుస్సేన్‌లా తాను కూడా దేశం విడువాలా అని ప్రశ్నించారు. తాను లౌకికవాద ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి తరలి వెళ్తానని హెచ్చరించారు.

English summary
Petrol bombs hurled at two theatres in Ramanathapuram in Tamil Nadu which were to screen Viswaroopam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X