వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలీన కలకలం: యాష్కీ సవాల్‌కు తెరాస సై, లేదంటే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod Kumar
హైదరాబాద్/వరంగల్: కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూ బ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ముఖ్యమంత్రి పదవి కోరకుండా, సీట్ల బేరం లేకుండా బేషరతుగా కాంగ్రెసులో విలీనం చేస్తారా? అని సవాల్ విసిరిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీకి తెరాస నేతలు కౌంటర్ ఇచ్చారు. సోనియా తెలంగాణ ఇస్తే.. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తామని ఆ పార్టీ నేత వినోద్ కుమార్ బుధవారం అన్నారు.

వరంగల్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కెసిఆర్ స్పష్టంగా హామీ ఇవ్వలేదనటంమధు యాష్కీ, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వ్యాఖ్యలు సరికావని ఆయన అబిప్రాయపడ్డారు. ఒకవేళ వారం దాటిందంటే తామే కేంద్రంపై పోరాడి తెలంగాణను సాధించుకుంటామన్నారు. తెలంగాణ కోసం తెరాస ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.

సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్, సీమాంధ్ర నేతలు, మంత్రులను ఏం చేసినా తక్కువేనని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హైదరాబాదులో మండిపడ్డారు. తెలంగాణ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వారికి సిగ్గు, శరం.. విలువలు, నీతినిజాయితీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది చనిపోయారని, ఇందుకు కారణమైన వారిని ఖూనీకోర్లు అనక ఏమనాలన్నారు.

కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేయాలని అడగటానికి సిగ్గుందా? కాంగ్రెస్ బలంగా ఉందని ఓ వైపు చెబుతూనే మరి విలీనం ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ భాష బాగా లేదంటున్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి వేషం బాగుందా? అన్నారు. 'జగ్గారెడ్డి దొంగలకు సద్దులు మోసే సన్నాసి అని మండిపడ్డారు. ఆయన ఆకు రౌడీకి ఎక్కువ, వీధి రౌడీకి తక్కువ అని తెరాస ఎద్దేవా చేసింది.

English summary
The Telangana Rashtra Samiti (TRS) on Wednesday offered to release a letter merging the party with Congress if the latter conceded separate Telangana in its form prior to 1956 with Hyderabad as capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X