చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాపై నిందలు: 'విశ్వరూపం'పై జయ, కమల్‌పై సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalitha
చెన్నై: కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రానికి సంబంధించి తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఖండించారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడారు. విశ్వరూపం సినిమాను తమిళనాడు ప్రభుత్వం నిషేధించడానికి సరైన కారణాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యానే సినిమాను నిలిపివేశామని ఆమె సమర్థించుకున్నారు.

రాష్ట్రంలో పలు ముస్లిం సంఘాలు విశ్వరూపం సినిమాను నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరాయన్నారు. అందుకే శాంతిభద్రతల దృష్ట్యా నిలిపి వేసినట్లు చెప్పారు. ప్రభుత్వం తప్పన్నట్లుగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. సినిమాను ముస్లిం సంఘాలు వ్యతిరేకించినందున.. థియేటర్ల వద్ద హింస చోటు చేసుకుంటే దానికి బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు. ముస్లిం సంస్థల అభ్యంతరం వల్ల నిలిపేశామన్నారు.

రాష్ట్రంలో విశ్వరూపం ఐదు వందలకు పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైందన్నారు. అన్ని థియేటర్లలో భద్రత కల్పించడం కష్టమన్నారు. అందుకే నిలుపుదల చేసినట్లు చెప్పారు. జయ టివితో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవన్నారు. విశ్వరూపం నిలుపుదల రాజకీయం కోసం చేసింది కాదన్నారు. కమల్ హాసన్ పైన తనకు ఎలాంటి కక్ష లేదన్నారు. సినిమా విడుదల సందర్భంగా అల్లర్లు జరుగుతాయనే నిఘావర్గాల సమాచారముందన్నారు. విశ్వరూపం విషయంలో మీడియా అతి చేసిందన్నారు.

కమల్‌పై సెటైర్లు

పంచెకట్టు వ్యక్తి ప్రధాని అవుతారన్న కమల్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చెబితే చిదంబరం ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. ప్రధానిని కమల్ ఎంపిక చేయలేరు కదా అని సెటైర్ వేశారు. కమల్‌కు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు పూర్తిగా ఉందన్నారు. అందుకే అలా మాట్లాడారన్నారు. దాంతో తాను ఎందుకు కక్ష పెంచుకుంటానని అభిప్రాయపడ్డారు. కమల్ తనకు రాజకీయ ప్రత్యర్థి లేదా శత్రువు కాదన్నారు. తనకు సినిమాలు చూసే సమయం లేదన్నారు. సినిమాలను నిషేధించే పూర్తి అధికారాలు రాష్ట్రానికి ఉన్నాయని చెప్పారు.

సినిమా కోసం ఆస్తులన్నీ కుదువ పెట్టానన్న కమల్ హాసన్ వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. అయన అన్నీ తెలిసిన పెద్దమనిషి అని, తెలిసి తెలిసి రిస్క్ తీసుకున్నారన్నారు. ఆయన రిస్క్ తీసుకుంటే ప్రభుత్వం ఎలా బాధ్యురాలు అవుతుందని ప్రశ్నించారు. ఈ సినిమా విషయంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు, రాగద్వేషాలు లేవన్నారు. కమల్ బాధ్యతాయుతమైన పౌరుడుగా ఉండాలని సూచించారు.

English summary
Tamilnadu CM Jayalalitha clarified on Kamal Hassan's Viswaroopam issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X