వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే తప్ప...

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తెలంగాణకు అనుకూలంగా కాస్తా ముందడుగేసినప్పటి నుంచి కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సంప్రదింపుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇటీవలి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిల పక్ష సమావేశం వరకు సంప్రదింపుల వద్దనే తెలంగాణ అంశం అగిపోతోంది.

తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం ఎంత ఎక్కువగా మొగ్గు చూపుతోందో, అంతే వెనక్కి వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర నేతలు రాజీనామాలతో ఎదురు తిరిగారు. అప్పటి నుంచి తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.

ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంపై తీవ్ర నిరాశానిస్పృహలను వ్యక్తం చేస్తూ 800 మందికిపైగా మరణించారని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు గురువారంనాడు చెప్పారు. జనవరి 28వ తేదీలోగా సుశీల్ కుమార్ షిండే ఇచ్చిన హామీ మేరకు తెలంగాణపై ప్రకటన చేస్తారని ఎదురు చూశారు. కానీ, ఒక్కసారిగా కాంగ్రెసు అధిష్టానం యు - టర్న్ తీసుకుంది. మళ్లీ సంప్రదింపులంటూ తొండిచేయి చూపింది. అప్పటి నుంచి జనవరి నెలలో తొమ్మిది మంది యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యలకు కారణం కె. చంద్రశేఖర రావు కారణమంటూ సీమాంధ్ర నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. లేనిపోని ఆశలు పెట్టడం వల్ల యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారంటున్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చిదంబరం చేసిన ప్రకటన తర్వాత సీమాంధ్ర నాయకులు ఎదురు తిరిగినప్పటి నుంచే తెలంగాణలో ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, తెలంగాణను అడ్డుకోవడం వల్లనే తెలంగాణ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెరాస నాయకులు అంటున్నారు. ఎవరేం చెప్పినా ఆత్మహత్యల పరంపర తెలంగాణకు శాపంగా మారింది.

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే

కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన తర్వాత యుపిఎ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ సమస్యపై అధ్యయానికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ చుట్టూ తెలంగాణ, సీమాంధ్ర నాయకులు తిరిగారు. అయినా ఫలితం వెలువడలేదు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి స్థానంలో ఉన్నారు.

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాహారదీక్ష నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి పి. చిదంబరం ప్రకటన చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కూడా సూచించారు. అయితే, ఆ మర్నాడే సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అసెంబ్లీలో తీర్మానం కూడా పెట్టలేదు. ఆ తర్వాత డిసెంబర్ 23వ తేదీన చిదంబరం మరో ప్రకటన చేసి, తెలంగాణ ప్రక్రియపై వెనకడుగు వేశారు.

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే

తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఈ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేస్తున్నట్లు కనిపించింది. విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. అయినా, తెలంగాణకు పరిష్కారం చూపకుండా ఆరు ప్రత్యామ్నాయాలను చూపింది. దీంతో తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అటుంచి, సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే

కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా గులాం నబీ ఆజాద్ ఇరు ప్రాంతాల పార్టీ నాయకులతో విస్తృతంగానే చర్చిస్తున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరగాల్సి ఉందని, నిర్ణయానికి సమయం కావాలని, నిర్ణయం తీసుకోవడానికి ఏ విధమైన గడువులు లేవని చెబుతూ వస్తున్నారు.

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే

తెలంగాణ విషయంలో మరో కేంద్ర మంత్రి వాయలార్ రవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన కూడా తెలంగాణపై ఎప్పటికప్పుడు దాటవేసే ప్రకటనలే చేస్తున్నారు.

ఫొటోలు: తెలంగాణపై సంప్రదింపుల సందడే

చిదంబరం నుంచి హోం మంత్రిత్వ శాఖను తీసుకున్న సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి నెలలోగా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. జనవరి 28వ తేదీతో గడువు ముగిసింది. ఇప్పుడు ఆయన మాట మార్చి తెలంగాణపై ఇంకా సంప్రదింపులు జరగాలని అంటున్నారు.

అయినా సరే, కాంగ్రెసు పెద్దలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు ఇంకా జరగాలంటూ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, తెలంగాణకు గడువులు ఏవీ లేవని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని సంకేతాలు అందిన ప్రతిసారీ సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దానికితోడు, సీమాంధ్ర నాయకులు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ వెంటనే తెలంగాణపై నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.

English summary
Congress high command is not in a position to deliver its decision on Telangana. The Congress high command leaders like Ghulam Nabi Azad are postponing the decision on Telangana on the name of consultations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X