తెలంగాణకు మద్దతు: ప్రత్యేక విదర్బపై పవార్ గురి

Telangana-Sharad Pawar
న్యూఢిల్లీ‌: వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన కేంద్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రత్యేక విదర్భపై గురి పెట్టినట్లే కనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్ష ముందుకు నడుస్తుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తాము విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు కూడా అనుకూలంగానే ఉన్నామని ఎన్సీపి నేత తివారీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్ధంచడమేనని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కాదని ఆయన అన్నారు. గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు.

నిజానికి, అత్యంత పాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు తెలంగాణకు, విదర్భకు సంబంధించినవే. ఈ రెండు ప్రాంతాల డిమాండ్లను పక్కన పెట్టి కేంద్రం మూడు రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని తూర్పు జిల్లా విదర్భ. మహారాష్ట్రలో వెనకబడిన ప్రాంతంగా కూడా దానికి గుర్తింపు ఉంది. విదర్భలోని పెద్ద నగరం నాగపూర్. విదర్భలోని ఎక్కువ మంది ప్రజలు మరాఠీ మాండలికం వహర్దీ మాట్లాడుతారు.

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే భావనకు గురైన విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తలెత్తుతోంది. మహారాష్ట్రలో దశాబ్దం పాటు 32 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అందులో 70 శాతం ఆత్మహత్యలు 11 జిల్లాలతో కూడిన విదర్భలోనే జరిగాయి. అపారమైన ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అడవులు, పర్వత శ్రేణులతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది.

తెలంగాణకు మాదిరిగానే విదర్భ దక్కన్ పీఠభూమిపై ఉంది. విదర్భలో అమరావతి, నాగపూర్ డివిజన్లు ఉన్నాయి. విదర్భలో పది లోకసభ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 62 శాసనసభా స్థానాలున్నాయి. ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ గోండ్యా లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నాగపూర్ రాజధానిగా విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ 1956లో సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రాంతమైన హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో విలీనం చేయకూడదని, ఒకవేళ విలీనం చేయాలనుకుంటే 1961 ఎన్నికల వరకు ఆగాలని, అప్పుడు హైదరాబాద్ శాసనసభలోని మూడింట రెండు వంతల శాసనసభ్యులు అంగీకరిస్తేనే విలీనం చేయాలని ఫజల్ అలీ కమిషన్ సూచించింది. ఫజల్ అలీ కమిషన్‌నే ఇప్పుడు మొదటి ఎస్సార్సీ అంటున్నారు. ఉనికిలో లేనిదాన్ని రెండో ఎస్సార్సీగా పిలుస్తున్నారు. అయితే, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సును పట్టించుకోకుండా కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర రాష్ట్రంలో విదర్బను విలీనం చేశారు.

తెలంగాణ ఉద్యమకారులు తరుచుగా విదర్బను ప్రస్తావించడం పరిపాటిగానే ఉంటోంది. తెలంగాణతో పాటు ఏర్పాటు కావాల్సిన ప్రత్యేక రాష్ట్రంగా విదర్భను చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు. అది సహజం కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+