వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమూ విడిపోతాం: తెలంగాణ ఇస్తే.. మళ్లీ గూర్ఖాల్యాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gorkha Janmukti Morcha wants Gorkhaland if Telangana is created
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తే తమకూ ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఇవ్వాల్సిందేనని గూర్ఖా జనముక్తి మోర్చా(జిజెఎం) డిమాండ్ చేసింది. జిజెఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్ కె సింగ్‌ను కలిసింది. తమ డిమాండ్లను ఆయన ముందు ఉంచింది. తమ కోరికలను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు తెలియజేస్తామని సింగ్ హామీ ఇచ్చినట్లు ఆ తర్వాత రోషన్ మీడియాతో చెప్పారు.

కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో తమకూ గూర్ఖాల్యాండ్ ఇవ్వాలని ఆయన అన్నారు. ఒకటి రెండు రోజుల్లో తాము కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి తర్వాత డార్జిలింగ్‌కు వెళ్తామన్నారు. తాజా పరిస్థితులపై చర్చిస్తామని చెప్పారు. ఒకవేళ కేంద్రం తెలంగాణకు పచ్చజెండా ఊపితే మాకు రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మార్చి 10వ తేదిన తమ డిమాండ్లు తీర్చాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని రోషన్ చెప్పారు.

గుర్ఖాల్యాండ్ రాష్ట్రం కోసం జిజెఎం కొన్నేళ్లుగా ఉద్యమిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేక ప్యాకేజీతో జిజెఎంను తన దారిలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రత్యేక డిమాండ్ ఊపు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం గూర్ఖా ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. దానికి అదనపు పరిపాలన, ఆర్థిక అధికారాలు కట్టబెట్టింది. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.

అయితే కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడంతో జిజెఎం మళ్లీ తన డిమాండును తెరపైకి తీసుకు వచ్చింది. ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరం కలిసి ఉందామని, అభివృద్ధి చెందుతామని జిజెఎం అధినేత సమక్షంలోనే గూర్ఖాల్యాండులో చెప్పారు.

English summary
Amid indications that the Centre is finally ready to create Telangana, the Gorkha Janmukti Morcha (GJM) — the group spearheading the demand for Gorkhaland state — on Thursday asked the government to consider its demand too if it created a separate state out of Andhra Pradesh or else it would launch a mass agitation in favour of its demand on March 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X