ఆదర్శ రైతులు బెల్టు షాపుల్లో...: బొత్సపై చంద్రబాబు

'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం ఉదయం ఇబ్రహింపట్నం మండలం నల్లకుంట నుంచి చంద్రబాబు నాయుడు యాత్రను ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ కార్యకర్తలే అని, వారంతా బెల్టు షాపుల్లో పనిచేస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
వ్యవసాయాన్ని తాము లాభసాటిగా మార్చామని, తమ పార్టీ ప్రభుత్వ హయంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు. జలయజ్ఞం ద్వారా లబ్ది చెందింది వైయస్ రాజశేఖర రెడ్డి, కాంట్రాక్టర్లే అని ఆరోపించారు. తొమ్మిది ఏళ్లు అయినా పులిచింతలను పూర్తి చేయలేకపోయారని, పోలవరానికి కాల్వలు కట్టించలేకపోయారని ఆయన విమర్శించారు.
డెల్టా, సాగర్ కాల్వల ఆధునికీకరణలో అంతా అవినీతే అని చంద్రబాబు ఆరోపించారు. కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శనివారం నాటికి 124వ రోజుకు చేరింది. నల్లకుంటలో చంద్రబాబు నాయుడిని హీరో కళ్యాణ్ రామ్, పార్టీ నాయకుడు, సినీ నటుడు మురళీమోహన్ కలుసుకున్నారు. చంద్రబాబును వారు పరామర్శించారు.












Click it and Unblock the Notifications