అరుణ హత్య కేసు: చంచల్‌గుడా జైలుకు శివకుమార్

నిరుడు డిసెంబర్ 31 తేదీన అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే శివకుమార్ మహారాష్ట్రకు పారిపోయాడు. అరుణ శివకుమార్ నివాసంలోనే మరణించింది. శివకుమార్ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్‌ను పోలీసులు జనవరి 4వ తేదీన పూణే నుంచి రైలులో తీసుకుని వస్తుండగా అతను వేగంగా పరుగు తీస్తున్న రైలు నుంచి కిందికి దూకాడు.
రైలు నుంచి కిందికి దూకడంతో శివకుమార్ కుడి చేయి, ఎడమ కాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో అతని కాలును, చేతిని వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి అతను పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం కుదుట పడడంతో శివకుమార్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రైలునుంచి దూక ఆత్యహత్యకు ప్రయత్నించినందుకు గాను అతనిపై పూణేలో కూడా కేసు నమోదైంది.
అరుణ హత్య కేసులో పోలీసులు ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణ శివకుమార్ నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications