వైయస్ జగన్ ఎమెల్యే పార్టీలోకి జోగి రమేష్ జంప్?

వైయస్ జగన్‌కు మద్దతు ఇస్తున్న తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై వేటు వేసినట్లు బొత్స శుక్రవారం చేసిన ప్రకటనపై మాట్లాడేందుకు జోగి రమేష్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఏర్పాటు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని దించి, తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు బొత్స ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని బొత్స కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగానే జోగి రమేష్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
జోగి రమేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు మొదటి నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే, చాలా కాలంగా ఆ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన కాంగ్రెసులోనే కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేటు వేస్తున్నట్లు బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. అది జోగి రమేష్‌కు మింగుడు పడని వ్యవహారంగా మారిందని అంటున్నారు.
మొత్తం వ్యవహారంలో తెలంగాణ నుంచి మరో విమర్శ కూడా వస్తోంది. వైయస్ జగన్‌ను బలోపేతం చేయడానికి సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తున్నారనేది ఆ విమర్శ. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజీనామా చేస్తానని జోగి రమేష్ చెబుతూ వస్తున్నారు. శనివారంనాటి మీడియా సమావేశంలో కూడా దానికే తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర పేరుతో వైయస్ జగన్‌ను బలోపేతం చేసి, అటు వైపు వెళ్లడానికి చూస్తున్న ప్రజాప్రతినిధుల జాబితాను కాంగ్రెసు పార్టీ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications