విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుతో కళ్యాణ్‌ రామ్, ఓడిన చోటే: మురళీ మోహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kalyan Ram-Murali Mohan
విజయవాడ: కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని నందమూరి హీరో కళ్యాణ్ రామ్, సినీ నటుడు, పార్టీ నాయకుడు మురళీమోహన్ శనివారం ఉదయం కలుసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకుంట శిబిరం వద్ద చంద్రబాబును కళ్యాణ్ రామ్ కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కూడా కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మురళీమోహన్ చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. పోయిన చోటనే వెతుక్కుంటానని, ఓడిన చోటనే గెలవాలనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. ఒకే చోటి నుంచి పోటీ చేస్తానని, ఒకే పార్టీలో ఉంటానని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, కాలి నొప్పి ఉన్నా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. గాడి తప్పిన రైలును పట్టాలెక్కించి, పరుగులు పెట్టించాలని ప్రజలు చంద్రబా7బు నుంచి కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకపోతే 3 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆయన అన్నారు.

అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే లక్ష కోట్లు తిన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను అధికారంలోకి తెస్తే, ఇళ్ల కప్పులూ ఉండవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి అవినీతిపరులకు ఓటు వేస్తే పంచభూతాలను సైతం ఫలహారంగా మింగేస్తారని ఆయన శుక్రవారం పాదయాత్రలో హెచ్చరించారు. గజదొంగలతో చంచల్‌గూడ జైలు కిటకిటలాడుతోందని, మంత్రులూ అక్కడకే పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

English summary
Nandamuri hero Kalyan Ram has met Telugudesam president N Chandrababu Naidu, who is in padayatra in Krishna district. Murali Mohan said, after meeting Chandrababu, that he will contest from Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X