అమ్ముకోవడానికి అవిశ్వాసమా: జగన్ పార్టీపై బాబు

ఒకరు చెబితే చెప్పించుకునే పరిస్థితుల్లో లేమని, వారికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ఆదివారం ఆయన పాదయాత్ర సాగించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు పేటల మీదుగా 6.6 కిలోమీటర్లు నడిచారు.
పిల్ల కాంగ్రెస్ పార్టీకి (వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి) చెందిన కొంతమంది రానున్న ఎన్నికలలో తమ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారని, ప్రధానమంత్రి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తామని ప్రకటిస్తున్నారని, రాష్ట్రంలో ఐదు సీట్లు వస్తేనే కేసులు మాఫీ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
రాజకీయాలతో మతాన్ని కలపడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కులం అన్నది యాదృచ్ఛికమని, మతం ఒక విశ్వాసమని అమెరికాలో ఒబామాను ఆయన మెరిట్ చూసి గెలిపించారని, ఈ రకమైన సంస్కృతిని తీసుకు రావాలన్నదే మా అభిమతమని ఆయన వివరించారు. తాము పుట్టించిన పిల్ల కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని ఢిల్లీలో కాం గ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని, ఆ రెండూ ఎప్పుడైనా కలిసిపోతాయని ఆయన అన్నారు.
ఎన్టీఆర్‌పై కేసులు పెట్టారని, తనపై వైయస్ రాజశేఖర రెడ్డి 35 కేసులు పెట్టించారని, 25 కమిషన్లు వేయించారని, తాను ఎక్కడా తప్పు చేయలేదనిస లేదంటే తనను సైతం ఈ కాంగ్రెస్ నాయకులు బెదిరించేవారని ఆయన వివరించారు. సీల్డ్ కవర్ల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేసుకుంటున్నాడని కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు.
రాష్ట్రంలో దుష్టులు, దుర్మార్గులు పరిపాలన సాగిస్తున్నారని వారిని అంతమొందించటానికి రామరాజ్యాన్ని తీసుకురావాలని అన్నారు. సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పెట్టి ఓట్లను కొంటే తెలుగుదేశం పార్టీ పోరాడిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు రాలేదని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అడ్రస్ గల్లంతు అయిందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications