షర్మిల, బ్రదర్ అనిల్‌లపై బిజెపి: టిడిపిపై పడ్డ జూపూడి

తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ పావుగా మారినట్లుగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. టిడిపి ఇచ్చిన కాగితాలతో ప్రెస్ మీట్ పెట్టే ముందు సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన చూసుకోవాల్సి ఉండెనన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోమని జగన్ చెప్పడం ఆ పార్టీ నేతలకు రుచించక పోయి ఉండవచ్చునని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లౌకికవిధానం నచ్చకుంటే దానిపై పోరాడండని సూచించారు.
ప్రజా సమస్యల పైన పోరాడకుండా వైయస్ కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైయస్ కుటుంబంపై బిజెపి ఆరోపణలు ఆ పార్టీ పతనావస్థను సూచిస్తున్నాయని విమర్శించారు. షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో తమ నాయకులపై ఏదో రకంగా బురదజల్లే టిడిపి వ్యూహంలో ఆయన ఓ పావుగా ఉపయోగపడుతున్నారన్నారు. వైయస్ మృతి తర్వాత మూడున్నరేళ్లకు వారి కుటుంబ సభ్యులపై బిజెపి రాష్ట్ర నాయకుడు విచిత్ర ఆరోపణలు చేశారన్నారు.
తెలుగుదేశం, బాబును భుజానికెత్తుకున్న ఛానళ్లలో ఈ ప్రెస్ మీట్‌కు లభించిన ప్రాధాన్యం, ఎల్లో పత్రికల్లో సోమవారం ఈ వార్తలకు లభించే ప్రాధాన్యం టిడిపి - బిజెపిల బంధాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు తోడ్పడుతాయన్నారు. సిబిఐ కేసును కాంగ్రెసు - టిడిపిలు సంయుక్తంగా నడుపుతున్నాయని ఆరోపించారు. జగన్ పైన కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అని తాము అనడం లేదని, సుష్మనే చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications