పార్టీలో లేను, తెలంగాణలో రెబెల్‌ని: కెకె వ్యాఖ్య

తెలంగాణపై నెల రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తమాషా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, షిండే దెబ్బ తీశారని ఆయన అన్నారు. వారిద్దరు తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ జెఎసి చెప్పినట్లు చేయాల్సిన అవసరం తమకు లేదని తెలంగాణకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ జెఎసిపై ఆయన సోమవారం ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ వాణిని ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ జెఎసి నేతలు వారి పని వారు చేస్తున్నారని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకుంటే గల్ఫ్ బాధితులను తీసుకుని వస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే డబ్బులు లేనివారిని ప్రభుత్వం ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications