వైఎస్ సహా: తెలంగాణపై లగడపాటి ట్విస్ట్, జగన్‌ వర్గంపై

Lagadapati Rajagopal
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణపై కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ వ్యతిరేకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం లగడపాటి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సహా తాను కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు.

అయితే ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ ఏర్పాటు మాత్రం అసాధ్యమన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరే సమస్యే లేదన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తొలి నుండి ఒకే వైఖరితో ఉందన్నారు. కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకున్నందునే తాము కనువిప్పు దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

తమ వైఖరి మొదటి నుండి స్పష్టంగానే ఉన్నా టిడిపి వైఖరే మారిందన్నారు. విభజనపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. అలాగే సీమాంధ్ర ప్రజలు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారన్నారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదరదని, అలాగే తెలంగాణ ఏర్పాటు కష్టమన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయన్నారు. తెలుగు నేల ప్రతి ఒక్కరిది అన్నారు. అది ఏ ఒక్కరి సొంతం కాదన్నారు.

సహకార ఎన్నికల్లో కాంగ్రెసు హవా సాగిందన్నారు. వచ్చే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెసు పార్టీ హవానే కొనసాగుతుందని చెప్పారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెసు పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారన్నారు. కాబట్టి ఏ నేత కూడా కాంగ్రెసు పార్టీని వదలే ప్రసక్తి లేదన్నారు.

పార్టీలోని ఏ ఎమ్మెల్యే రాజీనామా చేసినా వెంటనే ఆమోదించాలని తాను బొత్సను కోరినట్లు చెప్పారు. తమ కృష్ణా జిల్లా నుండి పార్టీకి, పార్టీ పదవులకు ఎవరూ రాజీనామా చేయలేదని, చేసేది లేదన్నారు. అందరూ కాంగ్రెసులోనే ఉంటారని చెప్పారు. కాగా ఇటీవల పలువురు నేతలు రాజీనామాలు చేసి జగన్ పార్టీలోకి వెళ్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారి రాజీనామాలు ఆమోదించాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+