రోజాకు హామీ: జయప్రద, మోహన్‌బాబు రీఎంట్రీ అదుర్స్
హైదరాబాద్: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ ఆరంగేట్రం అదురుతుందా? అనే చర్చ వారి అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో సాగుతోంది. యుపి రాజకీయాల్లో ఉన్న జయప్రద 2014 నాటికి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే చెప్పారు.
కానీ, ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పడం లేదు. కాంగ్రెసు పార్టీతో విభేదించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు ఆమె వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆమె వ్యాఖ్యలు వాటిని ధృవీకరించేలా ఉంటున్నాయి. టిడిపి ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించిన జయప్రద ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా యుపికి వెళ్లారు. ఆమె తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
కొద్దికాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు, విలేకరులు చెప్పిన పార్టీలోకి వెళ్తానని ఆయన గతంలో చెప్పారు. అంతకుముందు అవినీతిరహిత పార్టీలోకి వెళ్తానని చెప్పారు. అంతకుముందు ఏడాది తిరుపతిలోని తన పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి బాబును మోహన్ బాబు ఆహ్వానించారు. దీంతో ఆయన టిడిపిలో చేరతారనే ప్రచారం సాగింది.

జగన్ పార్టీలోకి సిగ్నల్స్ ఇచ్చిన జయప్రద. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు చంద్రబాబుపై పొగడ్తలు గుప్పించిన ఆమె ఇటీవల ఆయనపై విమర్శలు చేసింది.

జగన్‌ను గతంలో చంచల్‌గూడ జైలులో కల్సిన మోహన్ బాబు. సంవత్సరంన్నర క్రితం తన పాఠశాలలో కార్యక్రమానికి బాబును పిలిచిన మోహన్ బాబు ఆ తర్వాత జగన్‌ను జైలులో కలవడం, ఆయనకు అనుకూలంగా మాట్లాడం చేశారు.

టిడిపి ద్వారా రాజకీయారంగేట్రం చేసిన ఈ ఇద్దరు బాబుపై అసంతృప్తితో ఒకరు యుపి రాజకీయాల్లోకి వెళ్లగా, మరొకరు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు జగన్ వైపు చూస్తున్నారనే చెప్పవచ్చు.

ఇప్పటికే జగన్ పార్టీలో రోజా కీలకంగా ఉన్నారు. ఆమె కోరుకున్న నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ రోజాకు హామీ ఇచ్చారట. ఇమేజ్ కలిగి ఉన్న జయప్రద, మోహన్ బాబులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని, వారి రీ ఎంట్రీ అదిరిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ, ఆయన జగన్ వైపే వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరెస్టుకు ముందు మోహన్ బాబు ఇంటికి వెళ్లడం, జైలులో జగన్‌ను మోహన్ బాబు, ఆయన తనయుడు కలవడం, జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం తదిదర పరిణామాలు గమనిస్తే ఆయన జగన్‌కు జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మోహన్ బాబు, జయప్రదలు స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానంతో టిడిపిలో చేరి బాబుతో విభేదాల కారణంగా జగన్ పార్టీలోకి వెళుతుండటం గమనార్హం.
ప్రస్తుతం జగన్ పార్టీకి రాష్ట్ర రాజకీయాల్లో అనుకూలంగా ఉంది. అదే సమయంలో జయప్రద, మోహన్ బాబులకు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు వారికి మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రోజా జగన్ పార్టీలో ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. ఆమె కోరిన నియోజకవర్గం నుండే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారట. జయప్రద, మోహన్ బాబులకు కూడా జగన్ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, జయప్రద రీ ఎంట్రీ అదురుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications