తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

సత్యం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలో 13 ఏళ్లుగా చురుకుగా పనిచేస్తున్నాడు. తెలంగాణ పాటలు పాడేవాడు. వృత్తి రీత్యా సుతార్ మేస్త్రి అయిన సత్యం ప్రస్తుతం బుద్ధారం తెరాస గ్రామశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మెడకు తెరాస కండువా కప్పుకొని బయటికి వెళ్లి ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పలువురికి ఫోన్‌ద్వారా తెలిపాడు.
జనవరి 28న తెలంగాణ ప్రకటన చేస్తారని ఆశించి, రాకపోవడతో మనస్తాపం చెంది తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి సోదరుడు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ ఎస్ఐ బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో సత్యం మృత దేహాన్ని పలువురు తెరాస నాయకులు సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతదేహంతో క్లాక్‌టవర్ సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications