ఆధారాలున్నవి: శంకర్రావు కూతురుకు గ్రీన్‌ఫీల్డ్ విక్టిమ్స్

కాగా గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు కూతురు సుష్మిత ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. తన తండ్రిని అరెస్టు చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)చే విచారణ జరిపించాలని ఈ సందర్భంగా సుష్మిత డిమాండ్ చేశారు.
తన తండ్రిని ఎలాగైనా జైలుకు పంపించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పుడు తన తండ్రితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిఐడి విచారణకు ఆదేశించిందని కానీ, తాను సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తన తండ్రి 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయకుంటే ఎలా అని సుష్మిత ప్రశ్నించారు.
పోలీసులపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. కాగా గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో గత గురువారం సాయంత్రం పోలీసులు శంకర రావును అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దళిత సంఘాలు, మంత్రులు.. ఇలా పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవడంతో పోలీసులు తాము అతనిని అరెస్టు చేయలేదని విచారించేందుకు తీసుకు వెళ్లామని చెప్పారు. అనంతరం శంకర రావు అనారోగ్యానికి గురి కావడంతో పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications