Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఆర్టిస్టులు ఇలా...

న్యూఢిల్లీ: కళాకారుల పట్ల భారత ప్రజల్లో అసహనం పెరిగిపోతోందా అనే అనుమానం వేస్తోంది. మనోభావాలను దెబ్బ తీశారనే ఉద్దేశంతో కళాకారులను స్వేచ్ఛను హరిస్తున్నామా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను చెప్పుకుంటాం. కానీ వివాదమే నినాదంగా మారి కళాకారులు ఇక్కట్ల పాలవుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి.

కళాకారులు ఎల్లవేళలా సరిగానే వ్యవహరిస్తారని చెప్పడానికి లేదు. ఒబిసి, ఎస్సీ, ఎస్టీల్లో అవినీతి ఎక్కువ అని ప్రముఖ రచయిత ఆశిష్ నంది ఆరోపణ పూర్తిగా బాధ్యతారహితమైంది. అవినీతికి కులం లేదనే విషయం పలు సంఘటనలు తెలియజేస్తూనే ఉన్నాయి. మీడియా కూడా అగ్నికి ఆజ్యం పోస్తుందనే అభిప్రాయం కూడా ఉంది.

రాజకీయ నాయకులు తమకు వ్యతిరేకంగా కళాకారులను ఇబ్బంది పెట్టడానికి కూడా వివాదాలకు పురుడు పోస్తున్నారనే చర్చ సాగుతూనే ఉన్నది. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాపై తమిళనాడులో తలెత్తిన వివాదం ఇందుకు ఊదాహరణగా చెప్పవచ్చు. ముస్లింల మనోభావాలను కమల్ హాసన్ దెబ్బ తీశారనే ఆరోపణపై వివాదం పెద్ద యెత్తున వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి జయలలితపై అన్ని వైపుల నుంచీ విమర్శలు వచ్చాయి.

వివాదాల చిట్టా చిన్నదేమీ కాదు. దానికి పెద్ద చరిత్రనే ఉంది. సాంస్కృతిక అసహనం ముదిరి సాంస్కృతిక ఉగ్రవాదంలోకి జారిపోతున్నామా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఏది రాయాలన్నా ఇప్పుడు భయపడాల్సిందేనా... స్థిరమైన నిశ్చితాభిప్రాయాలకు భిన్నంగా వచ్చిన దాన్ని ఎదుర్కోవడానికి కళాకారులపై సమరం సాగించడం అవసరమా, వారి అభిప్రాయాలపై చర్చ జరగడం అవసరమా అనేది ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది.

పెదవి కదిపి, మాట బయటకు వస్తే ప్రపంచమంతా వ్యాపిస్తోంది. బ్లాగ్‌లు, సోషల్ నెట్ వర్క్ సైట్స్, మీడియా చానెళ్లు ఉన్నదున్నట్లుగా ప్రపంచం మీదికి వాటిని వదిలేస్తున్నాయి. తాజాగా చెలరేగిన వివాదాల చిట్టా చూస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

ప్రసిద్ద రచయిత ఎకె రామానుజన్ రాసిన మూడు వందల రామాయణాలు అనే పుస్తకంలోని అంశాలు వివాదంగా మారాయి. కొన్ని రామాయణాల్లో రాముడు, సీత వరుసలు తేడాగా ఉన్నాయని ఆయన రాశాడు. ఈ వ్యాసాన్ని 2006లో చరిత్ర విభాగంలో పాఠ్యాంశంగా చేర్చారు. దీన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఢిల్లీ హైకోర్టు నిపుణుల కమిటీ ఆ వ్యాసానికి సానుకూల తీర్పు ఇచ్చినా అకడమిక్ కౌన్సిల్ వ్యతిరేకతకు తలొగ్గక తప్పలేదు. దీన్ని 2011లో సిలబస్ నుంచి తొలగించారు.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఉదంతం అందరికీ తెలిసిందే. హిందూ దేవతలను నగ్నంగా చిత్రించారనే ఆరోపణపై హుస్సేన్ మీద వివాదం చెలరేగింది. ఆయన దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌కు రావాలని ఉన్నా బెదిరింపులకు ఝడిసి ప్రవాసంలోనే ఉండిపోయారు. దేశం వెలుపలే ఆయన కన్నుమూశారు.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

సాటానికి వర్సెస్ రచయిత సల్మాన్ రష్డీ చాలా కాలంగా నిరసనలను ఎదుర్కుంటూనే ఉన్నారు. జైపూర్ సాహిత్య సమ్మేళనానికి రావాలని ఉన్నా ఆయన రాలేకపోయారు. రష్దీ దేశానికి వస్తే సహించేది లేదని కొన్ని సంస్థలు హెచ్చరించాయి.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

కోల్‌కతాలో మిడ్ నైట్స్ చిల్డ్రన్స్ చిత్రం ప్రచారం కార్యక్రమంలో, సాహిత్య గోష్టిలో ఆయన పాల్గొనాల్సి ఉండింది. అయితే, దాదాపు 100 మంది ముస్లిం నిరసనకారులు విమానాశ్రయం వద్ద రష్డీని అడ్డుకుంటామని ఆందోళనకు దిగారు. దాంతో భద్రతా కారణాల రీత్యా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన పర్యటనను రద్దు చేయించింది. దీనిపై రష్దీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తప్పు పట్టారు.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

హైదరాబాదులో బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ పాల్గొన్న ఓ సాహిత్య సభపై మజ్లీస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

ఆశిష్ నంది జైపూర్ సాహిత్య సమ్మేళనంలో ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అగ్రవర్ణాల అవినీతి చాప కింద నీరులా కనిపించకుండా ఉండిపోతుంటే, వెనకబడిన వర్గాల అవినీతి బహిరంగంగా చర్చనీయాంశమైందని ఆయన అన్నారు. దానికి కొనసాగింపుగా అవినీతిపరుల్లో ఎక్కువ మది ఓబిసి, ఎస్సీ వర్గాల నుంచి కూడా ఎక్కువగా ఇటీవలి కాలంలో వస్తున్నారంటూ వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ చేసిన ఓ వ్యాఖ్య పాకిస్తాన్, భారత్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. షారూక్ ఖాన్ స్పష్టత ఇచ్చేంత వరకు వివాదం కొనసాగింది. 24 గంటల పాటు తీవ్ర దుమారం చెలరేగింది.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

కమల్ హాసన్ విశ్వరూపం సినిమాపై చెలరేగిన వివాదం దేశాన్ని కదిలించింది. ఈ వివాదం చెలరేగడంలో రాజకీయాలే ఎక్కువగా ఉన్నాయనే విమర్శ వచ్చింది. చిదంబరానికి అనుకూలంగా మాట్లాడిన కమల్ హాసన్‌ను లొంగదీసుకోవడానికి జయలలిత వివాదానికి తెరలేపారనే విమర్శ ప్రధానంగా వచ్చింది. చివరకు కమల్ హాసన్ దిగిరావాల్సి వచ్చింది.

చిత్రాలు: వివాదాల సుడిగుండంలో ఇలా..

ఆత్మకథ రాయాలన్న కోరిక ఉన్నప్పటికీ రష్దీలాగా తన పైనా వివాదాలు వస్తాయో అన్న భయంతోనే ఆ పనిని తాను చేయడం లేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు అన్ని వివరాలనూ బయట పెట్టలేమన్నారు. అటువంటప్పుడు రాయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ పటౌడీకి సంబంధించిన పుస్తకావిష్కరణ సభలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+