గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుర్చీ ఇవ్వలేదని జగన్ పార్టీ పెట్టాడు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదనే జగన్మోహన్‌రెడ్డి పిల్ల కాంగ్రెస్‌ (వైయస్సార్ కాంగ్రెసు)ను ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జైలు పార్టీకి ఓటేస్తే మీరూ జైలుకెళతారని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. జగన్‌కు బెయిల్ ఎందుకు రావడంలేదో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.

వైయస్ జగన్ లక్ష కోట్లు దోచారని సాక్ష్యాత్తు ఒక న్యాయమూర్తే అన్నారని ఆయన గుర్తుచేశారు. దీన్ని బట్టి జగన్ చేసిన నేరం ఎంత తీవ్రమైందో తెలుస్తోందని ఆయన చెప్పారు. గురువారం ఉదయం ఎన్నారై వైద్య కళాశాల నుంచి 129వ రోజు పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ వర్తించే విధంగా ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే మిర్చి రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరు, విజయవాడ నగరాలను జంటనగరాలుగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. రెండు నగరాలకు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దాని నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరీల ముఖ్యమంత్రని, ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పాదయాత్రను ముగించుకుని ఆయన బుధవారం గుంటూరు జిల్లాలో అడుగుపెట్టారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu said that YS Jagan has started YSR Congress party, as he has not been made as CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X