హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలపై సోమిరెడ్డి ఫైర్: జగన్ పార్టీకి వీరశివా ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy-Veerasiva Reddy
హైదరాబాద్: పదే పదే న్యాయస్థానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కనీసమైన అనుభవం, అవగాహన లేకుండా షర్మిల చేస్తున్న వ్యాఖ్యల్లో పరిపక్వత లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అవిశ్వాస తీర్మానం ఎక్కడ, ఎప్పుడు పెట్టాలో తమ పార్టీకి తెలుసునని, ఈ విషయంలో ఎవరి ఉచిత సలహాలూ అవసరం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించలేకపోయిందని, గత 8 ఏళ్లలో కాంగ్రెసు ప్రభుత్వంపై తాము నాలుగు సార్లు ప్రజా సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు. చేతనైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ బలాన్ని గవర్నర్ ముందు నిరూపించుకుని ప్రభుత్వంతో విశ్వాస పరీక్ష పెట్టిస్తే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని బతిమాలడడం ఎందుకని కాంగ్రెసు శానససభ్యుడు వీరశివా రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అడిగారు. చేతనైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవచ్చు కదా అని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు గతంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన విమర్శించారు. రాయలసీమకు ప్యాకేజీ కోరుతూ అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ వెళ్తామని వీరశివా రెడ్డి చెప్పారు.

అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ భయపడడం లేదని ఎమ్మెల్సీ, ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. 2014 వరకు రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన గురువారం న్యూఢిల్లీలో ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం గురించి చాలాసార్లు ప్రకటనలు చేసిందని, గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు ఏమైందో కూడా తెలుసునని ఆయన అన్నారు. శానససభ్యుల బహిష్కరణ అంశంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అవినీతి కళాశాలకు చంద్రబాబు ప్రిన్సిపాల్ అని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam party leader Somireddy Chandramohan Reddy has lashed out at YSR Congress party president YS Jagan's sister Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X