నా బలమెంతో చెప్తా: తమ్ముడి కోసం జెసి లాబీయింగ్

JC Diwakar Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ తాడిపత్రి సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి కోసం ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. జెసి సోదరుడు ప్రభాకర్ రెడ్డి డిసిసిబి అభ్యర్థిత్వం పోటీలు ఉన్నారు. దీంతో ఆయన తన సోదరుడికి పదవి వచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత అనంతపురం పార్టీ నేతలను కలిశారు.

ఈ సందర్భాలలో ఆయన మాట్లాడారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పారు. జిల్లాలో తన బలమెంతో తర్వాత చెబుతానని అన్నారు. తన సోదరుడి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. జిల్లా రాజకీయాలపై తాను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రితో చర్చించానని చెప్పారు. తన సోదరుడి డిసిసిబి అభ్యర్థిత్వం రేసులో ఉన్నారని చెప్పారు.

తనకు జిల్లాలో సన్నిహితులు, స్నేహితులు చాలామంది ఉన్నారన్నారు. పొత్తులు, మద్దతు వ్యవహారంపై చూడవచ్చునని అన్నారు. ఆ తర్వాత ఆయన జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు తిప్పే స్వామి, శివరామిరెడ్డి తదితరులను కలిశారు. తన సోదరుడికి అండగా నిలువాలని వారిని జెసి కోరినట్లుగా సమాచారం.

పార్టీ చెప్పినట్లు నడుచుకుంటా

డిసిసిబి అధ్యక్షుడి ఎంపిక పైన అధిష్టానం చెప్పినట్లుగా తాను నడుకుంటానని విప్ శివ రామి రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+