కుంభమేళా: నిత్యానంద హంగామా, మోడీ పర్యటనరద్దు
హరిద్వార్/కాశీ: మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలహాబాద్‌లోని త్రివేణి సంగమం భక్తులతో పోటెత్తుతుంది. ఈ ఒక్క రోజే దాదాపు రెండున్నర నుండు మూడు కోట్ల మంది వరకు భక్తులు వచ్చి పవిత్ర గంగానదిలో స్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. మౌని అమావాస్య రోజు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.
నాగా సాధువులు మకర సంక్రాంతి తర్వాత ఈ రోజు సాహీ స్నాన్ పేరిట రెండోసారి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. స్నానఘట్టాలలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని మోహరించారు. బాంబు నిర్వీర్య దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేసారు. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ఈరోజు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
కుంభమేలాలో నిత్యనంద హల్ చల్
నటి రంజితతో రాసలీలల సహా పలు ఆరోపణలు, కేసులలో ఇరుక్కున్న నిత్యానంద స్వామి కుంభమేళాకు హాజరయ్యారు. ఆయన పల్లకీలో ఊరేగుతూ కుంభమేళాకు వచ్చాడు. ఆయన వెంట వేలాది మంది భక్తులు వచ్చారు. కుంభమేళాలో విదేశీ భక్తులు సైతం పవిత్ర స్నానాలు చేశారు.
కుంభ మేళా పర్యటన రద్దు చేసుకున్న మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తన మహా కుంభమేళా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర గంగానదిలో స్నానమాచరించాలని మోడీ భావించారు. అయితే, అఫ్జల్ గురి ఉరితీత, భారీగా భక్తులు తరలి వస్తుండటం నేపథ్యంలో ప్రముఖులకు భద్రత కల్పించలేమని కుంభ మేళా అధికారులు చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా మోడీ కుంభ మేళా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుంభ మేళా పర్యటన కూడా భద్రతా కారణాల కారణంగా రద్దయింది. కాగా కుంభ మేళా నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాదులలో జరుగుతోంది.

మౌని అమావాస్య నేపథ్యంలో పవిత్ర గంగానదిలో స్నానమాచరించాలని మోడి భావించినా, భద్రతా కారణాల దృష్ట్యా తన కుంభ మేళా పర్యటనను రద్దు చేసుకున్నారు.

వివాదాస్పద నిత్యానంద స్వామి కుంభ మేళాలో పాల్గొన్నారు. పల్లకిలో ఊరేగారు.

కుంభ మేళాలో సాధువులు

పవిత్ర స్నానాలు చేసేందుకు తరలి వచ్చిన సాధువులు

ఇసుక వేస్తే రాలని జనం

వెలుగుల అలహాబాద్

స్నానం చేస్తున్న సాధువు

కుంభమేలాలో భక్తురాలు పవిత్ర స్నానం

నటి శిల్పా శెట్టి

స్నానమాచరిస్తున్న సాధువు
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications