ఓపికపట్టాలి: తెలంగాణపై మనీష్, టెర్రరిస్టుల్నివదిలేసింది

రాష్ట్రంలో, కేంద్రంలో మళ్లీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎలాంటి అవకాశం లేదన్నారు. ముందస్తుకు సంకేతాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. నిర్ణీత సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని చట్టానికి లోబడి తీసిందే అన్నారు. ఉగ్రవాదులను కాందహారులో వదిలేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది అన్నారు. కానీ, తాము ఉగ్రవాదులను వదిలి పెట్టడం లేదన్నారు.
ముందస్తుకు సంకేతాలు
దేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉన్నాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు హైదరాబాదులో అన్నారు. ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపిఏ అసమర్థ విధానాల వల్ల ద్రవ్యలోటు శాతం పెరిగిందన్నారు. త్వరలో పార్లమెంటుకు ఎన్నికలు వస్తాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నా థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు.
ప్రజల ఒత్తిడితోనే పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన అప్జల్ గురును ఉరి తీశారన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించి, దేశద్రోహికి సరైన శిక్ష విధించారన్నారు. పార్లమెంటు సిబ్బందిని హతమార్చినప్పుడు నోరెత్తని, పెదవి విప్పని కొందరు తీవ్రవాదిని ఉరి తీస్తే ప్రజా సంఘాల పేరుతో నిరసనలు తెలుపడం విడ్డూరమన్నారు.
నివేధికలు ఇవ్వలేదు
తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత లేదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానని అన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications