అద్వానీ బుక్‌పై అఫ్జల్ గురు ఆసక్తి, పాలే ఇష్టం

అద్వానీ మై కంట్రీ, మై లైఫ్ పేర రాసిన ఆత్మకథను చదవడానికి అతను విపరీతమైన ఆసక్తి చూపాడని అంటున్నారు. తనపై అద్వానీ ఏం రాశాడని తెలుసుకోవడానికి అతను ఆసక్తి ప్రదర్శించాడని చెబుతున్నారు. అప్పుడు పుస్తకాలు మాత్రమే అడిగేవాడని జైలు అధికారులు అంటున్నారు. అద్వానీ తన గురించి ఏం రాశాడని అఫ్జల్ గురు జైలు అధికారులను అడిగారని అంటున్నారు.
ఉర్దూ కవిత్వాన్ని చదవడాన్ని అతను ఎక్కువ ఇష్టపడేవాడని జైలు అధికారులు అంటున్నారు. అబుల్ కలామ్ ఆజాద్ రాసిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం కోసం కూడా అఫ్జల్ గురు అడిగిటన్లు తెలిపారు. తన సెల్‌లో అఫ్జల్ గురుకు చెందిన రేడియో, మతం, తత్వశాస్త్రం, చరిత్ర, ఉర్దూ కవిత్వం పుస్తకాలు ఉన్నాయని జైలు అధికారులు చెప్పారు.
సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో పాటు అఫ్జల్ గురు వస్తువులను తమకు ఇవ్వాలని అడుగుతున్నట్లు అఫ్జల్ గురు కుటుంబం తరఫు న్యాయవాది ఒకరు చెప్పారు. అఫ్జల్ గురు అన్నం ఇష్టపడకపోయేవాడని, పాలను విపరీతంగా ఇష్టపడేవాడని జైలు అధికారులు చెప్పారు. ఎక్కువగా పాలు అడుగుతుండేవాడని చెప్పారు. అఫ్జల్ గురును ఈ నెల 9వ తేదీన ఉరి తీసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications