వేధింపులు: అఫ్జల్‌ గురుతో భార్యకు లింక్ పెట్టిన భర్త

Afzal Guru
న్యూఢిల్లీ: తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యకు ఓ పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష అనుభవించిన అఫ్జల్ గురుతో సంబంధాలు అంటగట్టాడు. తన భార్య అఫ్జల్ గురు అనుచరురాలు అంటూ పోలీసులకు ఫోన్లు చేయడం ప్రారంభించాడు. జోగిందర్ సింగ్ సంధు అనే 33 ఏళ్ల వ్యక్తి జనవరి నుంచి ఢిల్లీ పోలీసులకు కనీసం 50 తప్పుడు కాల్స్ చేశాడు.

భార్య అతన్ని వదిలేసి ముంబై వెళ్లిపోయింది. దీంతో ఆమెను వేధించడానికి జోగిందర్ సింగ్ సంధు ఈ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నాడు. తన భార్య వద్ద ఉన్న తన మొబైల్ నెంబర్ చెబుతూ ఆమె అఫ్జల్ గురు అనుచరురాలు అని జనవరి 28వ తేదీన పోలీసులకు చెప్పాడు. ఢిల్లీలో మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరగవచ్చునని కూడా చెప్పాడు.

తమ మొదటి భార్య వదిలేసిన తర్వాత సంధు 2011 మార్చిలో రాఖీని పెళ్లి చేసుకున్నడాు. ఓ క్రిమినల్ కేసులో అతను 2012 ఏప్రిల్‌లో అరెస్టయ్యాడు. నిరుడు డిసెంబర్‌లో అతను విడుదలయ్యాడు. అప్పటి నుంచి భార్యతో తరుచూ గొడవ పడుతూ వచ్చాడని, ముంబైలోని ఓ వ్యక్తితో ఆమెకు వైవాహికేతర సంబంధం ఉందని అతను అనుమానిస్తూ వచ్చాడని, జనవరిలో ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు.

మహిళ వద్ద తన మొబైల్ నెంబర్ ఉందని, ఆమె అఫ్జల్ గురు అనుచరురాలని, ఢిల్లీలో మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరగవచ్చునని సంధు పిసిఆర్‌కు ఫోన్ చేసి జనవరి 28వ తేదీన చెప్పాడు. మర్నాడు కూడా అతను ఫోన్ చేసి తనను ఐపియస్ ఎస్ఎస్ చౌహాన్‌గా చెప్పుకుని తీహార్ జైలు, కన్నాట్‌ప్లేస్, బారకంభా రోడ్లలో మధ్యాహ్ననం రెండున్నర, మూడున్నర గంటల మధ్య పేలుళ్లు జరుగుతాయని చెప్పాడు. ఈ పేలుళ్ల సూత్రధారి రాఖీ అని చెప్పాడు. డిప్యూటీ పోలీసు కమిషనర్ (క్రైమ్, రైల్వేలు) ఈ విషయాలు చెప్పారు.

గత శుక్రవారం అతను ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తనను తాను ఐపియస్ ఎస్ఎస్ చౌహాన్‌గా చెప్పుకుని, ఓ మొబైల్ నెంబర్ ఇచ్చి, కుర్తా రైల్వే స్టేషన్‌లో ఆ వ్యక్తి బాంబు పెట్టబోతున్నట్లు సంధు చెప్పాడు. అతను ఇచ్చిన నెంబర్ రాఖీ ఫ్రెండ్‌ది.

సంధును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను 2002లో దేశరాజధానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. బిపిఎల్ కార్డులు, ఎలక్షన్ కార్డులు, ఆటో, టాక్సీ డ్రైవర్స్ బ్యాడ్జీలు ఇప్పిస్తానని నమ్మించి అతను డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+