హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెడీ..స్టార్ట్: 'ఉద్యమం'కు కెసిఆర్ క్లాప్, భిన్నమైందంటూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మధ్యాహ్నం ఉద్యమం అనే చిత్ర షూటింగను ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 'ఉద్యమం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి కెసిఆర్ ఈ రోజు క్లాప్ కొట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భవనమైన తెలంగాణ భవన్‌లో ఈ చిత్రానికి క్లాప్ కొట్టి, చిత్రీకరణనను కెసిఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఉద్యమం చిత్రం తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడుతుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఉద్యమం క్రమంలో ఏం చేయాలనే విషయం ఈ చిత్రం చెబుతుందని కెసిఆర్ అన్నారు. ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు ఈ చిత్రం మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు. గతంలో వచ్చిన తెలంగాణ చిత్రాలకన్నా భిన్నమైన కథతో ఇది వస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ ప్రజలకు ఈ చిత్రం దిశా నిర్దేశనం చేస్తుందని తాను విశ్వషిస్తున్నానని అన్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. గతంలో వచ్చిన తెలంగాణవాద చిత్రాలు అన్ని విజయం సాధించాయని గులాబీ అధినేత చెప్పారు.

కాగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇటీవల పలు చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో జైభోలో తెలంగాణ, ఆర్.నారాయణమూర్తి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వీర తెలంగాణ, పోరు తెలంగాణ తదితర చిత్రాలు వచ్చాయి. బతుకమ్మ చిత్రం కూడా తెలంగాణ పండుగ నేపథ్యంలో వచ్చిందే.

English summary

 Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao has clapped the shot at Telangana Bhavan on wednesday for Udyamam movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X