జగన్‌తో పంచుకున్నా! బాబువద్ద స్వేచ్ఛ లేదు: ఎమ్మెల్సీ

తాను పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు కూడా తన వెంటే ఉన్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికి చేరాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వైయస్ పథకాలు కొనసాగించడం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు.
వైయస్ జగన్‌కు అండగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జైల్లో ఉన్న జగన్‌ను కలిసిన తాను ఆయనతో తన అభిప్రాయాలు పంచుకున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదని ఆయన ఆరోపించారు. సమైక్యవాదంపై టిడిపి వైఖరి తనకు నచ్చలేదన్నారు.
కాగా అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు గురువారం ములాకత్ సమయంలో జైలులో కలిశారు.












Click it and Unblock the Notifications