వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూసైడ్స్: 60వ పుట్టిన రోజు వేడుకలకు కెసిఆర్ దూరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 17వ తేదిన కెసిఆర్ పుట్టిన రోజు. ఆయన అరవయ్యవ ఏటలోకి ప్రవేశిస్తున్నారు. అయితే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవద్దని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరు వేడుకలను నిర్వహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో జరుగుతున్న యువత, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారి ఆత్మహత్యలకు మనస్తాపం చెందిన ఆయన కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం ఆయన పేరిట గురువారం ప్రకటనను విడుదల చేసింది. గులాబీ దళపతి 1954 ఫిబ్రవరి 17న జన్మించారు.

సమ్మె సైరన్!

కాగా ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోతే మార్చి 20 తర్వాత ఏ క్షణాన్నయినా సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది. పూర్తిస్థాయిలో పదో వేతన సంఘం (పిఆర్సీ) ఏర్పాటు, సకల జనుల సమ్మె (42 రోజులు) ప్రత్యేక సెలవు మంజూరు, ఉద్యోగులపై కేసుల ఎత్తివేత, హెల్త్‌కార్డుల జారీ సహా తమ ప్రధాన డిమాండ్లపై ఇదే చివరి అల్టిమేటంగా భావించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా మార్చి 20న లక్షలాది ఉద్యోగులతో చలో అసెంబ్లీ నిర్వహించి, సమ్మె తేదీని ఆ రోజున ప్రకటిస్తామని పేర్కొంది.

గురువారం ఐకాస సారథ్య సంఘం అత్యవసర భేటీలో ఈ మేరకు తీర్మానించినట్లు అగ్రనేతలు జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్ విలేకరులకు తెలిపారు. మార్చి 1నుంచి చేపట్టనున్న ఉద్యమంపై సర్కారుకు శుక్రవారం నోటీసు ఇస్తామని చెప్పారు. అనంతరం 'చలో అసెంబ్లీ'కి ఉద్యోగులను సన్నద్ధం చేసేందుకు 3 నుంచి తెలంగాణలో బస్సు యాత్ర ప్రారంభిస్తామన్నారు. వాస్తవానికి 13వ పీఆర్సీ జీతాలు అందుకోవాల్సిన తరుణంలో పదో పీఆర్సీ కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో 24న జెఏసి నిర్వహించే 'సడక్ బంద్'లో ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

English summary
TRS chief K Chandrasekhar Rao has decided not to 
 
 celebrate birthday on February 17 in view of suicides 
 
 for Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X