వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిమ్మల్నేమైనా చేశాడా: మహిళావిలేకరితో వాయలార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వాయలార్ రవి మళ్లీ 'సారీ' చెప్పారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం చెప్పే బదులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో, జర్నలిస్టులు తీవ్ర నిరసన తెలిపారు. తగ్గిన వాయలార్ రవి వెంటనే క్షమాపణలు చెప్పారు. సూర్యనెల్లి మూకుమ్మడి అత్యాచారం కేసులో రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె కురియన్‌పై ఆరోపణలమీద స్పందించాల్సిందిగా బుధవారం ఓ టీవి మహిళా జర్నలిస్టు కోరారు.

దీనికి స్పందించిన వాయలార్.. బాధితురాలికి ఏమీ కాదన్నారు. అదే సమయంలో కురియన్‌తో నీకేమైనా వ్యక్తిగత వివాదాలున్నాయా? ఆయన మిమ్మల్ని ఏమైనా చేశారా? అంటూ వెకిలిగా మాట్లాడారు. దీనిపై పాత్రికేయులు, ప్రతిపక్షాలు కూడా ధ్వజమెత్తడంతో నాలుక్కరుచుకుని విచారం వెలిబుచ్చారు. అయినా పరిస్థితి చల్లబడకపోవడంతో తిరిగి క్షమాపణ కోరారు. ఐయామ్ సారీ... అలా వ్యాఖ్యానించడం తప్పేనని చెప్పారు.

గురువారమే ఆమె పని చేసే చానెల్‌కు ఫోన్ చేసి, వ్యక్తిగతంగా తాను పశ్చాత్తాపం తెలియజేశానని చెప్పారు. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని ఆయన అన్నారు. తనను అపార్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ జర్నలిస్టులతో సరదాగా మాట్లాడుతుంటానని అంతేతప్ప తన మదిలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. లేదు. దయచేసి ఆ వ్యాఖ్యను చలోక్తిగా మాత్రమే పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు దీన్ని జోక్‌గా మాత్రమే తీసుకోవాలని సూచించారు.

కాగా గతంలో తెలంగాణ అంశంపై వాయలార్ రవి చేసిన వ్యాఖ్యలు వివాదమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన అప్పుడు కూడా సారీ చెప్పారు. అప్పుడు ఇదే విషయం చెప్పారు. తాను జోక్‌గా మాత్రమే మాట్లాడానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని కోరారు. దాంతో అప్పుడు చల్లబడింది.

English summary
Union minister Vayalar Ravi on Thursday apologized for his sexist remarks against a woman journalist when he was asked about Rajya Sabha deputy chairperson PJ Kurien's role in Suryanelli gang-rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X