అక్బరుద్దీన్‌కు బెయిల్: ఊరటే, నిర్మల్ కేసులో జైల్లోనే

ఇక్కడ బెయిల్ రావడం అక్బరుద్దీన్‌కు ఊరట మాత్రమే. అదిలాబాదులో మరో కేసు పెండింగులో ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం అదిలాబాద్ సబ్ జైలులో ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సబ్ జైలు దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిజామాబాదు కోర్టులో బెయిల్ అక్బరుకు బెయిల్ వచ్చినప్పటికీ అదిలాబాదు జిల్లాలోని నిర్మల్ కోర్టులో బెయిల్ వస్తేనే విడుదలకు అవకాశం ఉంటుంది.
హిందువులపై, హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ నెల రోజుల క్రితం అరెస్టు చేశారు. డిసెంబర్ 22వ తేదిన అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవే వ్యాఖ్యలపై నిజామాబాద్ జిల్లాలో కేసు నమోదయింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది నిజామాబాద్ కేసుకు సంబంధించినది.
సిడిల్లోని వాయిస్ తనది కాదని చెప్పడంతో నిజామాబాద్, అదిలాబాదు కోర్టులు ఆయన వాయిస్‌ను టెస్టు కోసం తీసుకున్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాదు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు.












Click it and Unblock the Notifications