చెత్తకుప్పలో రెండు తుపాకులు, 20 బుల్లెట్స్

మున్సిపాల్ సిబ్బంది ఫిర్యాదు మేరుకు పోలీసులు అక్కకడకు చేరుకుని తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు 303 తుపాకులు, ఇరవై బుల్లెట్లను పోలీసులు అక్కడ గుర్తించారు. ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకు వచ్చారనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
హోటల్లో అగ్ని ప్రమాదం
నాంపల్లిలోని హోటల్ కామత్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
పైకప్పు కూలి ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో గల పివికె భూగర్భ గనిలో శుక్రవారం ఉదయం బొగ్గు ఉత్పత్తి పనుల నిర్వహిస్తుండగా గని పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వెంటనే సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications