జగన్‌కు రాజకీయాలా? కన్నీళ్లొస్తున్నాయి: బాబు

తాను గురువారం రోజు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డానని అన్నారు. భగవంతుడి సంకల్పం, ప్రజల ఆశీస్సులతోనే తాను పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా వచ్చిన సామాన్యులను మంత్రులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా చేస్తే వారు ఇప్పుడు విశ్వాసం లేకుండా పార్టీలు వీడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారి వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. వారే నష్టపోతారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి అవినీతిపరులు రాజకీయాలలో ఉండటం మన దురదృష్టకరమన్నారు. టిడిపిని వీడుతున్న నేతలు ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీలకు అమ్ముడు పోతున్న వారికి ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications