19 ఏళ్ల నర్సు గ్యాంగ్ రేప్, హత్య: బ్రౌన్ షుగర్ పట్టివేత

 young woman found murder
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని ధరూర్ మండల కేంద్రంలోని చర్చిలో ఈమె హత్యకు గురైంది. నర్సుగా పని చేస్తున్న ఈమెపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. మృతురాలు అదే జిల్లాకు చెందిన యాలాల మండలం రాస్నం గ్రామస్తురాలుగా గుర్తించారు. ధరూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కస్టడీ నుండి వ్యక్తి పరారీ

రాజధాని నగరం హైదరాబాదులోని ఉప్పల్ వద్ద పోలీసు కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం పరారయ్యాడు. భార్యను వేధించిన కేసులో నిందితుడిని న్యాయస్థానం నుండి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసుల కన్నుగప్పిన అతను పరారయినట్లుగా సమాచారం.

బ్రౌన్ షుగర్ లభ్యం

దిల్‌సుఖ్ నగర్‌లోని చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో బ్రౌన్ షుగర్ దొరికింది. చైతన్యపురి పోలీసులు శుక్రవారం ఉదయం మహ్మద్ గౌస్, షేక్ సల్మాన్ అనే ఇద్దరు యువకుల వద్ద నుండి బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

దొంగల బీభత్సం

నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం గొడుకండ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగులు ఆ ఇంటి యజమానిని హత్యచేశారు. అనంతరం మరో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మూడు తులాల బంగారం, రూ.10 వేల నగదును దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+