బొత్స, కిరణ్‌లతో కలిసి.. వేర్వేరుగా రాహుల్‌గాంధీ భేటీ!

రాహుల్ ఈ రెండు రోజులు వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు తీసుకోవల్సిన చర్యలపై వారితో నిర్మొహమాటంగా చర్చిస్తారు. అందులో భాగంగా బొత్స, కిరణ్‌లతో చర్చించనున్నారు. వారిద్దరితో కలిసి, ఆ తర్వాత వేర్వేరుగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇరువురి వాదనలను తీసుకొని వాటిని క్రోడీకరించనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ, సంస్థాగత సమస్యలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర, తెలంగాణ సెంటిమెంట్ తదితర అంశాలపై వారిద్దరి అభిప్రాయాలను వారి నుండి తెలుసునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండురోజుల్లో పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నేతలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్ రాష్ట్ర స్థాయి నేతలను కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతోనే పార్టీ వ్యవహారాలు చర్చించారు. ఇప్పుడు మొదటిసారి నేరుగా రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే అంశంపై రాహుల్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు.












Click it and Unblock the Notifications