ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అనుమానాస్పద మృతి

ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కుర్చీ నుంచి ఎంతకీ లేవకపోవడంతో భార్య దుర్గాప్రసాద్‌ను కదిలించింది. దాంతో అతనిలో కదలిక లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించారు. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గా ప్రసాద్ చివరగా ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుర్గాప్రసాద్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తేల్చారు.
దుర్గాప్రసాద్ మంచి ఆరోగ్యంతో ఉండేవారని, గుండెపోటుతో మరణించడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక యధావిధిగా జరుగుతుందని సంబంధిత అధికారులు ప్రకటించారు.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తూ ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓ అభ్యర్థి తరఫున వారు సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. యువకుల నుంచి పెద్ద యెత్తున సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications