హాస్టల్లో ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

మృతురాలిని 23 ఏళ్ల స్రవంతిరెడ్డిగా గుర్తించారు. ఆమె కడప జిల్లాకు చెందిన అమ్మాయి. ఎల్లారెడ్డిగుడాలోని సాయికృప నిలయం అనే వుమెన్స్ హాస్టల్లో రెండేళ్లుగా ఉంటున్న స్రవంతిరెడ్డి సోమవారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.
ఆమె ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. హాస్టల్‌లోని ఇతర అమ్మాయిలు ఉరేసుకుని కనిపించిన స్రవంతి రెడ్డిని చూసి హాస్టల్ యజమానులకు విషయం తెలిపారు. వెంటనే పంజగుట్ట పోలీసులు హాస్టల్‌కు వచ్చారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారని హాస్టల్ యజమాని శ్రీనివాస్ చెప్పాడు.
స్రవంతి రెడ్డి రాసి పెట్టిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications