గొడవలో తలదూర్చాడని వృషణాలు కోసేశారు

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - పిఠాపురం పట్టణం మంగాయమ్మరావుపేటకు చెందిన లంకా లోవరాజు ఆదివారం రాత్రి మరో వ్యక్తితో ఘర్షణకు దిగాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న నాగేశ్వరరావు జోక్యం చేసుకుని వారిద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
దాంతో నాగేశ్వరరావుపై లోవరాజు ఆగ్రహం వ్యక్తం చేసి నీ అంతు చూస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన అన్నదమ్ములను వెంట పెట్టుకుని వెళ్లి దారి కాసి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. ఇద్దరు వ్యక్తులు నాగేశ్వరరావును గట్టిగా పట్టుకున్నారు. మరో ఇద్దరు నాగేశ్వర రావు వృషణాలను కోసేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఆ సంఘటనను గమనించిన స్థానికులు బాధితుడిని పిఠాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపుగా 18 కుట్లు పడ్డాయని బాధితుడు చెబుతున్నాడు. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications