షర్మిల భర్త అనిల్‌పై విహెచ్ ఫిర్యాదు, కోర్టుకెక్కుతారు

V Hanumanth Rao - Anil Kumar
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని మణికొండలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మణికొండ భూముల కబ్జాపై ప్రభుత్వం విచారణ జరిపించి, న్యాయం చేయకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దర్నా చేస్తానని ఆయన మంగళవారంనాడు హెచ్చరించారు.

బ్రదర్ అనిల్ భూకబ్జా వల్ల బాధితులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని, వారి భూములను వారికి ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ పాలనలో పేదవారి భూములు లాక్కోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో అనిల్ ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సోమయాజులు చెప్పారు. ప్రతి కుంభకోణంతో అనిల్ కుమార్‌కరు సంబంధం పెట్టి ఆరోపణలు చేయడం దారుణమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు అనిల్ సిద్ధపడుతున్నట్లు ఆయన తెలిపారు.

బ్రదర్ అన్ని లావాదేవీలు కూడా సక్రమంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. లావాదేవీలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన మండిపడ్డారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయని చంద్రబాబు ఇప్పుడు హామీలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు సహనం కోల్పోయి నిస్పృహతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సహకార సంఘాల ఎన్నికలు ప్రస్తుతం జరిగినంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+