భర్తతో కలిసి తాగింది, ఆ తర్వాత కత్తితో దాడి చేసింది

ఆ దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు. శనివారం రాత్రి ఇరువురూ కలిసి మద్యం సేవించారు. ఆపై ఉన్నట్టుండి గొడవ పడ్డారు. ఆక్రమంలో సహనం కోల్పోయిన భార్య పద్మ కత్తితో భర్తమెడపై తీవ్రంగా గాయపర్చింది.
ఇది చూసిన కుమారుడు ఏకాంతాచారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని 108 వాహనం ద్వారా మహబూబాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఆస్పత్రికి చేరుకుని రాంబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
రాం బాబు పరిస్ధితి విషమంగా ఉండడంతో స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దాంతో భార్య పద్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ఆదివారంనాడు చెప్పారు.












Click it and Unblock the Notifications