వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి హవాలా: కర్ణాటకలో మరో ఐదు కేసులు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటకలో మరో ఐదు కేసులు నమోదయ్యాయి. సిబిఐ ఈ కేసులను నమోదు చేసింది. ఇనుప గనుల అక్రమ తవ్వకాలపై ఇప్పటికే ఆయన హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు. బళ్లారి నుంచి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా తరలించారంటూ తాజాగా బెంగళూరు సీబీఐ అధికారులు ఆయనపై అభియోగం మోపారు. దీనికి సంబంధించి గాలి, ఆయన పీఏ అలీఖాన్‌లపై ఐదు కేసులు నమోదు చేశారు.

ఈ కేసులు నమోదు కావడంతో బెంగళూరు సిబిఐ కోర్టు వారికి పీటీ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 23న హాజరు పరచాల్సిందిగా చంచల్‌గూడ జైలు అధికారులను బెంగళూరు సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇనుప ఖనిజం ఎగుమతి ద్వారా ఆర్జించిన సొమ్మును గాలి జనార్దన్ రెడ్డి హవాలా మార్గంలో దేశంలోకి తరలించాడని, దాన్నే రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాడని ఆరోపణలు మోపింది.

ముంబై కేంద్రంగా గాలి జనార్దన్ రెడ్డి హవాలా వ్యవహారం నడిపినట్లు సిబిఐ గుర్తించింది. తన వ్యూహంలో భాగంగా గాలి జనార్డన్ రెడ్డి చైనా, సింగపూర్, దుబాయ్‌ల్లో మారు పేర్లతో కొన్ని దిగుమతి కార్యాలయాలు ఏర్పాటు చేశాడని, విటి ద్వారా ఖనిజం ఎగుమతి ఆర్డర్లు తెప్పించాడని సిబిఐ ఆరోపిస్తోంది.

కాగా బెయిల్ కోరుతూ ఓఎంసీ కేసులో నిందితుడు గాలి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు 22కు వాయిదా వేసింది. ఇదే కేసులో మరో నిందితుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్‌పై డిఫెన్స్ న్యాయవాది వాదనలు ముగిశాయి. సిబిఐ వాదనలు వినేందుకు కేసును కోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది.

English summary
CBI has booked five more cases against Karnatka former minister Gali janardhan reddy in Karntaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X