గ్యాస్ కేటాయింపు: కిరణ్ రెడ్డికి సింధియా షాక్

అయితే గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని ఆయన తేల్చేశారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సింధియా ఈ సందర్భంగా సూచించారు.
గుజరాత్ - ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధియా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వగలమని సింథియా చెప్పారు. కాగా ఇటీవల ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి అదనపు గ్యాస్ సరఫరాపై ఇప్పటికే కేంద్రనికి లేఖ రాసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో తీవ్రమైన విద్యుచ్ఛక్తి కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నుంచి అదనపు గ్యాస్‌ను రాబట్టుకుని సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో అదనపు గ్యాస్ కేటాయింపు కోసం ఆయన కేంద్రానికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications