వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా చేయను, ఏదీ దాచడం లేదు: ఆంటోనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

A K Antony
న్యూఢిల్లీ: వివిఐపి హెలికాప్టర్ డీల్ కుంభకోణం వ్యవహారంలో తాను రాజీనామా చేయబోనని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ స్పష్టం చేశారు. రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు. వివిఐపి హెలికాప్టర్ డీల్‌లో 3600 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు.

హెలికాప్టర్ల కుంభకోణం ఆరోపణలపై పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తాము ఏ విషయాన్నీ దాచడం లేదని, పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆంటోనీ అన్నారు. అన్ని దశల్లోనూ తాము అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లంచాలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడం విచారకరమని ఆయన అన్నారు.

రక్షణ కొనుగోళ్లలో ఏ విధమైన రాజకీయ నిర్ణయం లేదని, చాపర్ డీల్ అంశం వ్యవహారంపై ప్రభుత్వంలో ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం మొత్తం కలిసికట్టుగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.

భారతదేశంలో 12 హెలికాప్టర్ల అమ్మకంపై లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటలీ కంపెనీ ఫిన్మెక్కానియాతో కోట్లాది రూపాయల డీల్‌ను రద్దు చేసుకోవడం అనేది ఇప్పటికిప్పుడు జరగదని అన్నారు. చర్యలు తీసుకోవడానికి ముందు తగిన సాక్ష్యాధారాల కోసం నిరీక్షించడం అవసరమని అన్నారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు.

English summary

 Defence minister A K Antony on Tuesday refuted reports about his resignation over alleged kickbacks in the over Rs 3600 crore VVIP helicopter deal and said he was getting ready for Parliament session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X