డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్, చిన్నారి ఆచూకీ లభ్యం

రెండు రోజుల క్రితం హైదరాబాదులోని ఉప్పల్‌లో కిడ్నాప్‌కు గురైన రెండేళ్ల చిన్నారి నుస్రత్ కథ సుఖాంతమైంది. నల్గొండ జిల్లా బీబీనగర్ దగ్గర చిన్నారి ఆచూకి లభించింది. చిన్నారి సహా కిడ్నాపర్లను పట్టుకున్న బీబీనగర్ వాసులు పోలీసులకు అప్పగించారు. ఘట్‌కేసర్ పోలీసుల వద్ద చిన్నారి క్షేమంగా ఉంది.
మంగళవారంనాడు ఇంటి ముందు ఆడుకుంటుండగా భరత్‌నగర్‌లో నివసించే జుల్ఫికర్ అలీ భుట్టో కూతురు నుస్రత్‌ను ఇద్దరు మహిళలు అపహరించారు. నుస్రత్‌ను వారు అపహరిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
చిన్నారి బీబీనగర్‌లో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా, స్థానికులు కిడ్నాపర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications