హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్‌ను వీడని హేట్ స్పీచ్: బెంగళూరు కోర్టు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
బెంగళూరు/హైదరాబాద్: హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఇప్పట్లో కేసులు వీడేలా కనిపించడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తాజాగా కర్నాటక పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీకి సమన్లను అందజేశారు. ఆయన వ్యాఖ్యలపై బెంగళూరులో కేసు నమోదయింది.

దీంతో ఈ నెల 23వ తేదిన కోర్టుకు హాజరు కావాలని బెంగళూరు మెట్రోపాలిటన్ కోర్టు అక్బరుద్దీన్ ఓవైసీకి సమన్లు జారీ చేసింది.బెంగళూరు పోలీసులు ఈ రోజు హైదరాబాదు బంజారాహిల్స్‌లోని అక్బరుద్దీన్ నివాసంలో ఆయనకు సమన్లు అందజేశారు. ఎల్లుండి వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆయనకు ఆదేశించింది.

అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల పైన దిలీప్ కుమార్, ధరంపాల్ అనే ఇద్దరు న్యాయవాదులు ఇటీవల బెంగళురు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. పిటిషన్‌ల పైన విచారణ జరిపిన న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ రోజు సమన్లు జారీ చేసింది.

కాగా, అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం మధ్యాహ్నం అదిలాబాద్ సబ్ జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు తరలి వచ్చారు. అక్బర్ జైలు నుండి విడుదల కాగానే ఘనంగా స్వాగతం పలికారు. మజ్లిస్ పార్టీకి, అక్బరుద్దీన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జైలు నుండి విడుదలైన అక్బర్ నేరుగా హైదరాబాదు చేరుకున్నారు.

English summary
Bangalore Court issued summons to MIMLP Akbaruddin Owaisi on two similar complaints lodged by advocates Dilip Kumar and Dharmapal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X